యువ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా సినిమా మిరాయ్ బాక్సాఫీస్ వద్ద జోరుగా దూసుకుపోతోంది. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ విజువల్ ఎంటర్టైనర్ విడుదలైన మొదటి రోజునే అద్భుతమైన వసూళ్లు సాధించింది. వారం ఆరంభంలో సోమవారం రోజు కూడా మంచి సంఖ్యలు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
ఇప్పటివరకు నాలుగు రోజులకే ఈ చిత్రం దాదాపు 91 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. దీంతో సినిమా 100 కోట్ల క్లబ్లో చేరే దిశగా వేగంగా పయనిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని చూస్తే ఐదో రోజుకే ఆ మైలురాయిని చేరే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఈ భారీ ప్రాజెక్ట్‌లో మంచు మనోజ్ ప్రతినాయకుడిగా ఆకట్టుకోగా, గౌరహరి అందించిన సంగీతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.