విశ్వంభర సినిమాలో చిరు పాత్ర ఎలా ఉంటుందంటే!

మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా తరువాత చేస్తున్న మో్ట్‌ అవైటెడ్‌ సినిమా విశ్వంభర. ఈ సినిమాను యంగ్‌ అండ్ టాలెంటెడ్‌ డైరెక్టర్ వశిష్ట ఎంతో గ్రాండ్‌ గా తెరకెక్కిస్తున్నాడు. బిగ్గెస్ట్‌ సోషియో ఫాంటసీ సినిమాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది.

ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మరో కీలక పాత్రలో ఖుష్బూ నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై బాగా అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈసినిమాలో చిరంజీవి పాత్ర అద్భుతంగా ఉంటుందని ఓ టాక్‌. ఈ సినిమాలో మెగాస్టార్ భూమిపై పుట్టిన కారణజన్ముడి పాత్రలో కనిపించనున్నాడు. విశ్వంభర సినిమాతో దర్శకుడు వశిష్ఠ ఓ ప్రత్యేక లోకాన్ని సృష్టిస్తున్నాడు

ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ జులై కల్లా పూర్తి చేసి ఈ సినిమా సీజీ, వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కోసం మరింత సమయం తీసుకోని అద్భుతమైన క్వాలిటీ విజువల్స్ ప్రేక్షకులకు అందించనున్నారు ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ 2025 జనవరి 10న, సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories