డైరెక్టర్ల కంట్లో పడిన ఏ అమ్మాయి అనే సరే కచ్చితంగా హీరోయిన్ అవ్వాల్సిందే. అయితే ఆర్జీవీ కంట్లో పడిన అమ్మాయి హీరోయిన్ అవ్వకముందే సెలబ్రిటీ అయిపోతుంది. ఆర్జీవీ కొద్ది రోజుల క్రితం శారీ గర్ల్ అనే ఒక అమ్మాయి నచ్చిందని చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి పేరు ఆరాధ్య దేవి. ఆమె గురించి ఆర్జీవీ చెబుతూ ఆమెతో ఓ సినిమా తీయాలని ఉందని చెప్పుకొచ్చాడు.
చెప్పినట్లుగానే ఆర్జీవీ ఆ అమ్మాయితో శారీ అనే టైటిల్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఆర్జీవీ ఆ అమ్మాయి గురించి చెప్పిన సమయంలో ఆమె చీర కట్టుకుని ఉన్న ఫొటోలను షేర్ చేశాడు. ఇప్పుడు తాజాగా ఆమె చిత్రాలను మరికొన్నిటిని విడుదల చేశాడు. ఈ చిత్రాలను చూసిన వారు ఎవరైనా సరే అంతకుముందు విడుదల చేసిన ఫోటోల్లో ఉన్న అమ్మాయి.. ఈ అమ్మాయి ఒకరేనా అని డౌట్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఎందుకంటే తాజా చిత్రాల్లో ఆ అమ్మాయి గ్లామర్ డోస్ భారీగా పెంచి అందాలు ఒలకబోసింది. ఈ ఫోటోలను ఆర్జీవీ షేర్ చేస్తూ ” ఇవి కేరళకు చెందిన ఆరాధ్య దేవి అనే యువతి ఫొటోలు. ఆర్జీవీ డెన్ లోని ఓ బృందం ఓ ఇన్ స్టా రీల్ ఈమెను కనుగొని.. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న శారీ అనే చిత్రం కోసం సంతకం చేసింది..ఫొటోగ్రాఫర్ యశ్వంత్ చేసిన ఫొటో షూట్ ఇది. చాలా అద్భుతంగా ఉన్నాయి కదూ” అంటూ ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.
ఈ ఫొటోల్లో ఆరాధ్య తన అందాలను అరబోస్తూ అదరగొట్టింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఎలా ఉండే పిల్లను ఎలా మార్చేసావ్ వర్మ.. చీర కట్టులో ముద్దుగా ఉండేది. ఇప్పుడేమో అన్ని విప్పి చూపిస్తుంది. నువ్వు ఆమెను ఎంకరేజ్ చేయకపోతే అలానే చీరలో అందంగా ఉండేది కదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.