ఎంత ముద్దుగున్నావే…!

మన టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా చేస్తున్న తాజా సినిమాల్లో తన కెరీర్ 37వ సినిమా కూడా ఒకటి. దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. మరి వారిలో యువ నటి సాక్షి వైద్య కూడా ఒకరు కాగా మరో నటి టాలెంటెడ్ సంయుక్త మీనన్ కూడా ఈ సినిమా యాక్ట్‌ చేస్తుంది.

మరి ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు సంయుక్త పుట్టినరోజు కానుకగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని విడుదల చేసారని చెప్పాలి. సినిమాలో ఈమె దియా అనే పాత్రలో నటిస్తుండగా ఆ పేరుకి తగ్గట్టుగానే చేతిలో వెలుగుతో దీపాలు పట్టుకొని సంయుక్త ఎంతో అందంగా కనిపిస్తుంది. దీంతో ఈ సినిమా నుంచి ఈమెకి నేడు పర్ఫెక్ట్ గిఫ్ట్ అని తెలుస్తుంది.

ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తుండగా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత అనీల్ సుంకర నిర్మాణం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories