యష్‌ మూవీ కోసం హాలీవుడ్‌ డైరెక్టర్‌!

కన్నడ రాకింగ్‌ స్టార్‌ యష్‌ హీరోగా నటించిన కేజీఎఫ్‌ తో పాన్‌ ఇండియా లెవల్లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. కేజీఎఫ్‌ రెండు సిరీస్‌ ల తరువాత యష్‌ ఇంకా ఎలాంటి సినిమా చేస్తాడో అనే ఆతృతతో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో లేట్ గా అనౌన్స్‌ చేసిన భారీ సినిమానే టాక్సిక్‌.

ఈ సినిమాకి మళయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తో చేస్తున్న ఈ సినిమా పట్ల ఇప్పటికే అభిమానుల్లో మంచి క్రేజ్ నెలకొంది. మరి ఆ క్రేజ్ కి తగ్గట్టు గానే ఊహించని ప్లానింగ్ లు మూవీ మేకర్స్ చేస్తున్నారు. అలా తాజాగా హాలీవుడ్ ఎడిషన్ ఈ చిత్రానికి తోడైనట్టుగా సమాచారం. హాలీవుడ్ లో ది డార్క్ నైట్, వార్ క్రాఫ్ట్, ఇన్సిప్షన్ వంటి భారీ చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అలాగే స్టంట్ నటుడు గా కూడా చేసిన టామ్ స్టర్తర్స్ టాక్సిక్ కోసం కూడా వర్క్ చేస్తున్నట్లుగా.. ఇప్పుడు టాక్‌ వినిపిస్తుంది.

ఇతను ఈ సినిమాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ అంటూ మరో టాక్‌ కూడా వైరల్ గా మారింది. మొత్తానికి అయితే ఈ సినిమా అనుకున్న దానికంటే గ్రాండ్ లెవెల్లో దూసుకుపోనుందని తెలుస్తుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories