హిట్‌ 3 …హిట్‌ అంతే!

నేచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “హిట్ 3” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఇపుడు యూనానిమస్ గా సాలిడ్ పాజిటివ్ టాక్ ని అందుకుంది. అటు రివ్యూస్ సహా ఆడియెన్స్ నుంచి కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇక మరింత లెవెల్లో హిట్ 3 మాస్ మేనియా చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే హిట్ 3 సినిమాకి ఆల్రెడీ మంచి బజ్ నడుమ సాలిడ్ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాలు సహా వరల్డ్ వైడ్ గా కనిపిస్తుండగా ఇపుడు మంచి టాక్ కూడా సొంతం కావడంతో ఈ చిత్రంకి మరింత బూస్టప్ అయ్యాయి. సో హిట్ 3 తో మాత్రం నాని మరో హిట్ అందుకున్నట్లే అని తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories