హిట్‌ 3 విడుదల ఎప్పుడంటే!

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తాజాగా విడుదలైన “సరిపోదా శనివారం” తో కలిపి హ్యాట్రిక్ విజయాలు అందుకుని ముందుకు దూసుకుపోతున్నాడు.  ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్ తో నాని ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయ్యాడు.

యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు శైలేష్ కొలను కాంబోలో చేస్తున్న మాస్ పోలీస్ అండ్ యాక్షన్ డ్రామా “హిట్ 3” సినిమాపై నేడు ఓ సాలిడ్ అప్డేట్ వస్తుంది అని మూవీ మేకర్స్ ముందుగానే అభిమానులకు తెలియజేశారు.

ఫైనల్ గా ఆ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది. మరి మేకర్స్ ఒక క్రేజీ మాస్ పోస్టర్ ని విడుదల చేసి అదరగొట్టగా దీంతో పాటుగా నానిపై తన మాస్ స్వాగ్ తో అర్జున్ సర్కార్ గా ఒక ఇంట్రెస్టింగ్ మాస్ గ్లింప్స్ ని కూడా తీసుకుని వచ్చారు. దీంనితో నాని ఫ్యాన్స్ కి మాత్రం ఇది మంచి ఫీస్ట్ ఇచ్చేలా ఉందని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని అయితే వచ్చే ఏడాది మే 1న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories