హిట్ 3.. బుకింగ్స్ లో ర్యాంపేజ్

ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ గట్టిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ టాలీవుడ్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం “హిట్ 3” అనే చెప్పాలి. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్‌  శైలేష్ కొలను తీర్చిదిద్దుతున్న ఈ మూవీ ఏపీ బుకింగ్స్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఏపీలో ఇంకా జీవో రావాల్సి ఉండగా దీన్ని ప్రభుత్వం విడుదల చేసింది. దీనితో సింగిల్ స్క్రీన్స్ కి అదనంగా 50 రూపాయలు అలాగే మల్టీప్లెక్స్ లకి 75 రూపాయలు వారం రోజులు పాటుగా పెంచుకునే వెసులుబాటుని కల్పించారు. ఇలా మొత్తానికి ఏపీలో సింగిల్ స్క్రీన్ కి గరిష్టంగా 195 నుంచి 200 టికెట్ ధర ఉండగా మల్టిప్లెక్స్ లో 295 వరకు ఉంది.

ఇక ఏపీలో బుకింగ్స్ మొదలు కావడంతోనే హిట్ 3 సాలిడ్ జంప్ ని బుక్ మై షో బుకింగ్స్ లో దూసుకుపోతుంది. గంటకి ఇపుడు 10 వేలకి పైగా టికెట్స్ హిట్ 3 కి నమోదు అవుతుండడం విశేషం. దీనితో ఏపీలో ఆడియెన్స్ కూడా నాని సినిమా కోసం గట్టిగా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. ఇక ఈ అవైటెడ్ చిత్రం గ్రాండ్ గా రేపు మే 1న విడుదల కాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories