నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరక్కేక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “హిట్ 3”. మరి అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇపుడు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా వచ్చిన ట్రైలర్ తో మరిన్ని అంచనాలు సెట్ చేసుకుంది. అయితే పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ఒకో భాషలో వస్తుంది.
అయితే మెయిన్ మన తెలుగు లోనే కాబట్టి హిట్ 3 ట్రైలర్ కి తెలుగులో ఒక రికార్డు బ్రేకింగ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్పాలి. మన బిగ్ స్టార్ హీరోస్ ట్రైలర్స్ కి వచ్చే రేంజ్ ఇంకా చెప్పాలంటే అంతకు మించే రెస్పాన్స్ ని హిట్ 3 అందుకోవడం విశేషం. దీంతో నాని క్రేజ్ ఎలా పెరుగుతుందో తెలుసుకోవచ్చు. మొత్తానికి మాత్రం నాని తన మార్కెట్ ని అంచలంచెలుగా పెంచుకుంటూ వెళుతున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ అవైటెడ్ చిత్రం ఈ మే 1న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.