నాచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన “హిట్ 3” సినిమాతో మరోసారి తన మార్క్ హిట్ ను సాధించాడు. శ్రీనిధి శెట్టి ఈ సినిమాలో నానికి జోడిగా నటించింది. సినిమాకు విడుదలకి ముందే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడినప్పటికీ, విడుదలైన తర్వాత ఆ హైప్‌కి తగ్గట్టుగానే ప్రేక్షకుల స్పందన వచ్చింది.
ఇప్పటికే ఈ చిత్రం విడుదలై ఆరు రోజులు పూర్తయ్యేలోపే వరల్డ్ వైడ్‌గా దూసుకెళ్తూ, మంచి వసూళ్లను రాబడుతుంది. పీఆర్ సమాచారం ప్రకారం, ఈ ఆరు రోజుల్లోనే సినిమా దాదాపు 60 కోట్లకు పైగా షేర్‌ను సంపాదించి, బ్రేక్ ఈవెన్‌ను కూడా క్రాస్ చేసింది. అంటే నిర్మాతలకు లాభాలు రావడం మొదలైపోయినట్లే.
ఈ సినిమా నానికి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు అందించిన ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చినప్పటికీ, కమర్షియల్‌గా కూడా ఈ స్థాయిలో హిట్ కావడం చాలా అరుదు.
మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ సినిమాస్ బ్యానర్లపై నిర్మించారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్స్ అన్నీ కలిపి ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ కట్టిపడేస్తున్న ఈ చిత్రం నానికి మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని చెప్పడంలో సందేహం లేదు.
ఇలాంటి విజయాలు “హిట్” సిరీస్‌కు వచ్చే భాగాలపై కూడా ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి.