నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ వైలెన్స్ యాక్షన్ చిత్రం “హిట్ 3”. మరి ఎన్నో అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా అభిమానులు సహా ఆడియెన్స్ అంచనాలు రీచ్ అయ్యి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతుంది. మరి డే 1 కే రికార్డు ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం యూఎస్ లో అయితే ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.
యూఎస్ మార్కెట్ లో నానికి ఉన్న క్రేజ్ ఏపాటిదో తెలిసిందే. అలా వచ్చిన ఈ సినిమా అప్పుడే 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని కేవలం ఈ రెండు రోజుల్లోనే అందుకుని రికార్డులు సృష్టించింది. దీంతో ఈ వారాంతంలో సునాయాసంగా 2 మిలియన్ మార్క్ ని దాటేసి అక్కడ కూడా నాని కెరీర్లోనే కాకుండా మన స్టార్స్ తాలూకా భారీ వసూళ్లు దగ్గరకి రీచ్ అయ్యే అవకాశాలున్నాయి. మొత్తానికి మాత్రం అర్జున్ సర్కార్ మాస్ సునామి ఇపుడు కొనసాగుతుంది.