టాలీవుడ్ లో ఉన్నటువంటి అతి తక్కువమంది సక్సెస్ ఫుల్ డైరెక్టర్లల్లో వరుస హిట్స్ తో అపజయం ఎరుగని దర్శకునిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి ఒకరు. మరి తాను చేసిన అన్ని సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమాల తర్వాత తాను చేసిన తాజా మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”.
వెంకీ మామ హీరోగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా తన సినిమాలు ఎలా చేస్తాడో చెప్పి అనీల్ రావిపూడి ఆశ్చర్యపరిచాడు. తన సినిమా మెయిన్ గా ఈ సంక్రాంతికి వస్తున్నాం అయితే కేవలం 72 రోజుల్లోనే చేసేసాం అని ఏ సీన్ అయినా కూడా ఇన్ని నిమిషాలు అనుకుంటే అన్ని నిమిషాలు మాత్రమే షూట్ చేస్తామని సో ఫైనల్ గా ఎక్కువ సినిమా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపాడు.
ఇలా సంక్రాంతికి వస్తున్నాం లో కూడా కేవలం 5 నిమిషాలు మాత్రమే కట్ చేసి టోటల్ గా 2 గంటల 22 నిమిషాలతో మూవీని తీసుకొస్తున్నట్టుగా చెప్పారు. దీంతో తన పర్ఫెక్ట్ ప్లానింగ్ పరంగా సోషల్ మీడియాలో ఆడియెన్స్ నుంచి ప్రశంసలు కూడా అందుకుంటున్నారు. ఇప్పుడు పలు సినిమాలు ఎన్నో గంటలు షూటింగ్ చేసుకొని మళ్ళీ అందులో ఓ గంట గంటన్నర ఫుటేజ్ లు డిలీట్ చేసుకునే కంటే ఇలా అనీల్ రావిపూడిలా ఎంతవరకు సినిమా అవసరమో అంతే చేసుకోవడం చాలా బెటర్ అని నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.