టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న తాజా సినిమాల్లో ‘తండేల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మొదలుకొని వీడియో గ్లింప్స్ వరకు అన్ని కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాతో అక్కినేని నాగచైతన్య సాలిడ్ హిట్ అందుకోవడం ఖాయమని అందరూ అంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి.
తాజాగా ఈ సినిమా నుంచి ‘హైలెస్సో హైలెస్సా’ అనే మెలోడీ పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి చక్కటి లిరిక్స్ అందించగా దేవిశ్రీ ప్రసాద్ మెలోడీ ట్యూన్‌తో మ్యూజిక్ మ్యాజిక్ చేసినట్లు తెలుస్తుంది.. ఇక ఈ పాటను నకాష్ అజీజ్, శ్రేయా ఘోషల్ అత్యంత అద్భుతంగా ఆలపించి శ్రోతలను ఓ ట్రాన్స్‌లోకి తీసుకుని వెళ్లిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు ఇప్పటివరకు ఇచ్చిన సాంగ్స్ అన్ని కూడా చార్ట్‌బస్టర్స్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ‘హైలెస్సో హైలెస్సా’ కూడా ఇన్‌స్టంట్ చార్ట్ బస్టర్‌గా నిలవడం ఖాయమని ఈ పాటను వింటే అర్థమవుతోంది.