తమిళ నటుడు కార్తి కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ‘యుగానికి ఒక్కడు’ చిత్రానికి తెలుగులో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అయితే, ఆ సినిమాకు థియేటర్లలో కంటే కూడా టీవీల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. కార్తి యాక్టింగ్, ఆయన చెప్పిన డైలాగులకు ఇప్పటికీ క్రేజ్ ఉంది.
ఇక ఇలాంటి కల్ట్ చిత్రాన్ని ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. 15 సంవత్సరాల తర్వాత వెండితెరపై మరోసారి చోళరాజుల ప్రతాపాన్ని వీక్షించవచ్చని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను మార్చి 14న గ్రాండ్ రీ-రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో థియేటర్లలో మరోసారి ‘‘రేయ్.. ఎవర్రా మీరంతా..’’ అనే డైలాగ్ హోరెత్తడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో ఈ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నారు.