ఏవయ్యా మారుతి..ఏంటిది!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న “ది రాజా సాబ్”పై ప్రేక్షకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. మొదటి నుంచి ఈ సినిమాపై అభిమానులు అంత పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంతేకాకుండా, గతంలో ప్రభాస్ చేసిన కొన్ని సినిమాలు నిరాశపరిచిన కారణంగా ఈ సినిమా విషయంలో కూడా జాగ్రత్తగానే ఉన్నారు. కానీ ఒక్కో స్టెప్ తో మారుతి అండ్ టీమ్ చూపిస్తున్న కంటెంట్ మాత్రం అభిమానుల్లో నమ్మకాన్ని పెంచింది.

ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ నమ్మకాన్ని మరింత బలపరిచింది. టీజర్ విడుదల సమయంలో ఎక్కువగా కొత్తదనం కనిపించకపోయినా, ట్రైలర్ మాత్రం అందరి అంచనాలను తారుమారు చేసింది. ఇందులో ప్రభాస్ ని పూర్తిగా కొత్త స్టైల్ లో చూపించడమే కాకుండా, విజువల్స్ నుంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వరకు అన్నీ ప్యాక్డ్ గా ఉండటంతో ప్రేక్షకులు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండలేకపోయారు.

మారుతి తీసుకున్న ప్రెజెంటేషన్, ప్రభాస్ కి ఇచ్చిన కొత్త డైమెన్షన్, ఆకట్టుకునే ట్రీట్‌మెంట్ ఇవన్నీ కలిపి ఈ సినిమాపై ఉన్న ప్రతికూలతను పాజిటివ్ గా మార్చేశాయి. ఈ ట్రైలర్ తోనే అభిమానులు “ఇదే మాకెదురుచూసింది” అని చెప్పేలా మారుతి చూపించారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ అవుతుందనే నమ్మకం బలపడుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories