హీరో రామ్‌ కొత్త అవతారం!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు కొత్త చిత్రంతో రాబోతున్నారు. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌లో షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ సరసన భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ వంటివి సినిమాపై మంచి హైప్‌ని తీసుకువచ్చాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ పాట విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేమభరితమైన రొమాంటిక్ మెలోడీగా ఈ పాట రాబోతున్నట్టుగా సమాచారం. ఈ స్పెషల్ సాంగ్‌ను సంగీత దర్శకుల ద్వయం వివేక్ – మెర్విన్ కంపోజ్ చేయగా, ఫేమస్ సింగర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. అయితే ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ పాటకు రామ్ స్వయంగా లిరిక్స్ రాశాడు. అంటే ఈసారి హీరోగా కాకుండా గీత రచయితగా కూడా తన టాలెంట్‌ను చూపించబోతున్నాడు.

ఈ లవ్ సాంగ్‌ను జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. పాట వినిపించిన వెంటనే శ్రోతల మనసుల్లో నిలిచిపోయేలా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇందులో సీనియర్ యాక్టర్ ఉపేంద్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి మొదటి పాట సినిమాపై మరింత ఆసక్తి పెంచేలా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.  

Related Posts

Comments

spot_img

Recent Stories