లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా చేస్తున్న సినిమాల్లో విశ్వంభర మూవీ కాకుండా మరో భారీ సినిమా లైనప్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాల్లో అనీల్ రావిపూడితో ప్లాన్ చేసిన సినిమా కూడా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలోనే మొదలు కానుండగా ఈ సినిమాపై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది.
అయితే ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ లో ఎవరు కనిపిస్తారు అని చాలా కాలం నుంచి ఉన్న సందేహామే. అయితే ఇపుడు నయనతార వరకు ఈ బజ్ రాగా ఆమెపై ఇపుడు తాజా టాక్ వినపడుతుంది. నయన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా కంటే ఒక పవర్ఫుల్ రోల్ లో కనిపించే అవకాశాలున్నాయంట. అయితే దీని గురించి మరింత క్లారిటీ రావాల్సి ఉంది.