ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ పై దండయాత్ర చేసింది. ప్రస్తుతం జపాన్ లో కూడా ఈ సినిమాకి భారీ ఆదరణ దక్కుతుంది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు మాత్రం భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, తాజాగా ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. ఇప్పటికే, కొరటాల శివ స్క్రిప్ట్ ఫస్ట్ డ్రాఫ్ట్ ను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఐతే, ఈ నెల నాలుగో వారం నుంచి మళ్లీ స్క్రిప్ట్ పై కూర్చుంటారట.
ముఖ్యంగా స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్ తో వర్క్ చేస్తారట. పాన్ ఇండియా వైడ్ గా కొన్ని కొత్త ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తారని తెలుస్తోంది. కాగా ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు.
. పైగా కథలో చాలా డెప్త్ ఉంటుందని తెలుస్తోంది.