వైసీపీకి తలపోటు : ‘‘అక్కడ 5వేలు ఇచ్చారుగా??’’

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఇప్పుడు కొత్త తలపోటు ఎదురవుతోంది. ఎన్నికల ప్రచారం ఎలా మంటగలిసినా సరే.. పోల్ మేనేజిమెంట్ ద్వారా గెలిచిపోవచ్చునని వారంతా అనుకున్నారు. ఎవరు ఎలా ప్రచారం నిర్వహిస్తే మాత్రం ఏముంది..? పోలింగుకు ముందు రోజు ఇచ్చే క్వార్టర్ బాటిల్, డబ్బులను బట్టే కదా ఓట్లుపడేది అని అధికార పార్టీ అభ్యర్థులు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. పైగా అయిదేళ్లు పాటూ అధికారంలో ఉండి సంపాదించుకున్న డబ్బును మళ్లీ గెలవడానికి ఖర్చు పెట్టకపోతే ఎలా? అనే భావన కూడా వారికి ఉంది. ఇప్పుడు డబ్బు పంపిణీ మొదలైంది. శనివారం రాత్రి నుంచే పలు నియోజకవర్గాల్లో ఇళ్లలో ఓట్లను లెక్కించి డబ్బు పంచేస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎదురవుతున్న కొత్త సమస్య ఏంటంటే.. పలుచోట్ల వారికి ప్రజలనుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఫలానాచోట మీ వారు ఒక్కో ఓటుకు అయిదువేల వంతున ఇచ్చారు కదా.. మాకు కూడా అలాగే ఇస్తే తప్ప ఓటు వేయం అంటూ డబ్బు తీసుకుంటున్న ఓటర్లు భీష్మించుకుంటున్నారు. తమకు కూడా ఓటుకు అయిదువేల వంతున ఇవ్వాలని పట్టుపడుతున్నారు. దీంతో అన్ని ప్రాంతాల వారికి అంతంతమొత్తం డబ్బు సప్లయి చేయలేక పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

ఎన్నికల్లో డబ్బు పంపిణీ పర్వం మొదలైపోయింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో మంచి దూకుడు మీదున్నారు. ఒక్కొక్క ఓటుకు రెండు వేల రూపాయలు చెల్లించడం అనేది కనీస ధరగా ఈసారికి నిర్ణయించారు. కొన్నిచోట్ల ఓటర్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నప్పుడు లేదా, ఇతర పార్టీల ఓటర్లు అయిఉంటే వారిని ప్రలోభపెట్టి తమకు ఓటు వేయించుకోవాలని అనుకున్నప్పుడు అయిదువేల వరకు కూడా ఇస్తున్నారు.
అయితే అలా కొన్నిచోట్లు రేటు పెంచి ఇస్తుండడమే అభ్యర్థులకు ప్రస్తుతం సంకటంగా మారుతోంది. సోషల్ మీడియా మాత్రమే కాకుండా కమ్యూనికేషన్ చాలా ప్రభలంగా ఉన్న ఈ రోజుల్లో ఎక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చినా క్షణాల్లో నియోజకవర్గం మొత్తం తెలిసిపోతోంది. మరో చోట డబ్బు ఇవ్వడానికి వెళ్లినప్పుడు.. ‘ఫలానా చోట అయిదువేలు ఇచ్చారంట కదా.. మేం మాత్రం అంత పనికిరానివాళ్లమా.. మాగ్కూడా అయిదువేలు ఇస్తే ఇవ్వండి లేకపోతే వెళ్లిపోండి..’ అంటూ ప్రజలు మొండికేస్తున్నారు. రెండువేలు ఇస్తే తీసుకోవడం లేదు. ఫరెగ్జాంపుల్ ఒక్కో నియోజకవర్గంలో లక్ష కొనడం అనేది టార్గెట్ గా పెట్టుకుంటే.. ప్రతి ఓటుకూ అయిదువేలు వంతున ఇవ్వడానికి అభ్యర్థులు సిద్ధంగా లేరు. ఇటు ప్రజలు ఒప్పుకోవడం లేదు. వైసీపీ వారికి ఎటూ అయిదేళ్లలో సంపాదించిన అక్రమార్జన పంచిపెట్లడమే అయినప్పటికీ.. మనసు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు పంపిణీ దగ్గర వైసీపీ వారికి కొత్త తలపోటు ఎదురవుతోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories