ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా రుక్షర్ ధిల్లాన్ హీరోయిన్ గా దర్శకుడు విశ్వ కరుణ్ తెరకెక్కిస్తున్న చిత్రం “దిల్ రూబా” కూడా ఒకటి. అయితే ఈ చిత్రం రిలీజ్ దగ్గరకి వచ్చిన నేపథ్యంలో మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని కూడా చేశారు. మరి ఈ ఈవెంట్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి.
ప్రెజెంట్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న యువతకి తన ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే ఒకవేళ పరీక్షల్లో రాసి లేదా చదివి తలనొప్పి వస్తే తన సినిమా చూడండి ఆ తలనొప్పి తగ్గిపోతుంది అని తాను హామీ ఇస్తున్నాడు. ఒకవేళ ఇప్పుడు చూడడం అవ్వకపోతే పరీక్షలు అయ్యాక అయినా తన సినిమా చూడండి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను అని ఈ యంగ్ హీరో ప్రామిస్ చేస్తున్నాడు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఇక ఈ సినిమా ఈ మార్చ్ 14న రిలీజ్ కి రాబోతుంది.