‘కన్నప్ప’ ఐడియా ఇచ్చింది ఆయనే!

మంచు విష్ణు హీరోగా నటిస్తున్న తాజా  భారీ పాన్ ఇండియా సినిమా “కన్నప్ప”. ఈ చిత్రం కోసం విష్ణు చాలా కఠినంగా కష్టపడుతున్నాడు. పైగా ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి ఎంతోమంది స్టార్‌  నటీనటులు కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కథ ఐడియా పై విష్ణు పలు ఆసక్తికర కామెంట్లు చేశారు.

‘కన్నప్ప’ సినిమా ఏడెనిమిదేళ్లుగా తన ప్రణాళికలో  ఉందని.. అయితే, బడ్జెట్ కారణాల వల్ల ఇప్పుడు లైన్‌ లోకి వచ్చిందని… అలాగే అసలు ఈ సినిమాకు ఐడియా తనికెళ్ల భరణి ఇచ్చారని హీరో మంచు విష్ణు చెప్పుకొచ్చారు. కాగా ఏప్రిల్ 25, 2025న ఈ సినిమా విడుదల కానుంది. ప్రీతి ముకుందన్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది.

ఈ ఫాంటసీ యాక్షన్ డ్రామాకి మహా భారత్ సీరియల్‌ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్‌ చేస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టీఫెన్‌ దేవస్సే, మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అత్యధిక భాగాన్ని న్యూజిలాండ్‌లో నే తీశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories