“ఓజి” కోసం ఆయన!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “ఓజి” . ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్‌ చేసుకుంది.  తాజాగా ఈసినిమా  చాలా కాలం గ్యాప్ తర్వాత షూటింగ్ ని పునః ప్రారంభించబోతుంది.

ఇక ఈ చిత్రం విషయంలో ఓ సాలిడ్ అప్డేట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఓజి లో ఆల్రెడీ ఓ సాంగ్ ట్రాక్ ని ప్రేక్షకులంతా విన్నారు. అది ఎంత పెద్ద హిట్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే,.  మరి ఈ సినిమాకి జైలర్ లో సెన్సేషనల్ సాంగ్ హుకుం టైగర్ కా హుకుం అనే సాంగ్ రాసిన రచయిత సూపర్ సుబు రెండు పాటలు అందిస్తున్నట్టు సమాచారం.

దీంతో ఓజి ఆల్బమ్ వేరే లెవెల్లో ఉంటుంది అని పవన్ అభిమానులు ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నరని తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Posts

Comments

spot_img

Recent Stories