విష్ణుని నెక్ట్స్‌ డైరెక్ట్‌ చేసేది ఆయనే!

హీరో విష్ణు మంచు ఇటీవల తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి రిస్పాన్స్ అందుకుంది. అసలు ఈ సినిమా విష్ణు కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలవడం విశేషం. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ డివోషనల్ మూవీలో భారీ తారాగణం కనిపించడం ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తీసుకొచ్చింది.

ఇప్పుడు ఈ విజయం ఆనందం లో ఉన్న విష్ణు, కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ తన తదుపరి సినిమా పనులు మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే కమర్షియల్ టచ్ ఉన్న మాస్ ఎంటర్‌టైనర్ కోసం సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించేది ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ ప్రభుదేవా అన్న వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇందులో కథనాయకుడు విష్ణు నటించనున్న సంగతి కన్ఫర్మ్ అయినప్పటికీ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద కన్నప్ప సక్సెస్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్న విష్ణు, మళ్లీ ప్రేక్షకులను మరో కమర్షియల్ సినిమాతో అలరించేందుకు సన్నద్ధమవుతున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories