దేవుడి దళారీలుగా, వైసీపీకి చందాలెత్తారా?

ఎంత గొప్ప అవినీతి పరులైనా.. అక్రమార్కులు అయినా.. దేవుడిని అడ్డు పెట్టుకుని తప్పుడు పనులు చేయడానికి కాస్త సంకోచిస్తారు. దేవుడు తమను క్షమించడని భయపడతారు. అక్రమాలకు పాల్పడినా కూడా కాస్త అదుపులో ఉంటారు. కానీ వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలో జరిగిన అక్రమాల గురించి వింటే విస్మయం కలుగుతోంది. కలియుగ శ్రీమన్నారాయణుడిగా భక్తులు ఆరాధించే వేంకటేశ్వరుడని అడ్డు పెట్టుకుని.. టీటీడీ అధికారులు, ధర్మకర్తల మండలి మొత్తాన్ని వైఎస్పార్ కాంగ్రెస్ వసూళ్ల పర్వాన్ని నడిపించారని వినిపిస్తున్న ఆరోపణలు గమనిస్తే అసహ్యం పుడుతోంది.

తెలుగుదేశం పార్టీకి చెందిన మాల్యాద్రి, నీలాయపాలెం విజయకుమార్ లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ను కలిసి టీటీడీలో గత అయిదేళ్లలో జరిగిన  అక్రమాల గురించి క్షుణ్నంగా విచారణలు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ కూడా కాని ధర్మారెడ్డిని.. కేవలం తనకు అనుకూలంగా మెలిగే వ్యక్తి అనే ఉద్దేశంతో తొలుత తిరుమల జేఈవోగా ఉంచి, తర్వాత ఈవో బాధ్యతలు కూడా అప్పగించి.. జగన్మోహన్ రెడ్డి అపరిమిత దందాలకు పాల్పడ్డారని వారు ఆరోపణల్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బడా పారిశ్రామికవేత్తలకు దర్శనాలు చేయించడం ద్వారా ఏర్పడే సంబంధ బాంధవ్యాలను.. వైసీపీకి విరాళాలు సేకరించడానికి వాడారని కూడా  ఆరోపించారు.

శ్రీవాణి ట్రస్టు రూపంలోగానీ, ఇతరత్రా వ్యవహారాల్లో గానీ.. టీటీడీలో అయిదేళ్లుగా జరిగిన అక్రమాల గురించి ప్రజలకు అవగాహన ఉంది. వైవీసుబ్బారెడ్డి ఒక రేంజిలో టీటీడీ లో బాగోతాలకు తెరలేపితే.. ఆ తర్వాత ఛైర్మన్ అయిన భూమన కరుణాకర రెడ్డి.. తన కొడుకు అభినయ్ ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ఏకంగా దేవుడినే పణంగా పెట్టేశారు. దేవుడి సొత్తును విచ్చలవిడగా పంచిపెట్టేయడానికి ఏకంగా 1772 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రతిపాదించారు. వందల కోట్ల రూపాయలు ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి దోచిపెట్టడానికి విపలయత్నం చేశారు. వీటితో పాటు అయిదేళ్లలో వైసీపీ నాయకులుగానీ, ఈవో ధర్మారెరడ్డి గానీ టీటీడీని అడ్డుపెట్టుకుని సాగించిన వ్యక్తిగత దందాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నింటి మీద సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ ఇప్పుడు కోరుతోంది. సరైన రీతిలో విచారణ జరిగితే.. దేవుడితో వ్యాపారం చేసిన వాళ్లు కటకటాల వెనక్క  వెళ్లకు తప్పదని ప్రజలు అంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories