ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో స్టార్ గా మారిపోయాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ భారీ బడ్జెట్ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.
అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల అయిన గ్లిమ్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెంచేశాయి. .అత్యంత భారీ బడ్జెట్ లో రానున్న ఈ సినిమాని రెండు భాగాలుగా తీసుకువస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం లో కనిపించబోతున్నాడు. దేవర మొదటి పార్ట్ ను సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నారు.
నేటి నుండి వచ్చే నెల 27కు దేవర రిలీజ్ కు ఇంక నెల రోజులు మాత్రమే ఉందని ఒక నెలలో, అతని రాక ప్రపంచాన్ని కదిలిస్తుంది, సెప్టెంబర్ 27న థియేటర్లలో అతని మెజెస్టిక్ మ్యాడ్నెస్ని చూసేందుకు రెడీ అవ్వండి అంటూ దేవరలోని తారక్ రెండు షేడ్స్ చూపిస్తూ అధికారక పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. మరో వైపు ఈ చిత్రంలోని మూడవ పాటను వినాయక చవితి కానుకగా సెప్టెంబరు 7న విడుదల చేయనున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు.
త్వరలోనే చివరి షెడ్యూల్ కొంత షూట్ కంప్లిట్ చేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా దేవర సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.