చైతూ న్యూ లుక్‌ చూశారా…ఎలా ఉన్నాడో!

యువ సామ్రాట్‌ అక్కినేని నాగ చైతన్య చాలా కాలం గ్యాప్‌ తరువాత నటిస్తున్న చిత్రం తండేల్‌. ఈ చిత్రాన్ని  స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. 2018లో గుజరాత్‌ లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది.

 ఈ సినిమా నాగ చైతన్య  కెరీర్‌ లో 23 వ సినిమాగా తెరకెక్కుతుంది. కార్తికేయ 2 సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న చందు మొండేటి,నాగ చైతన్య కాంబినేషన్ లో మూడో సినిమాగా ‘తండేల్’ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

తండేల్‌ మూవీ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్‌ 20న థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే మేకర్స్ పోస్టర్స్ ,గ్లింప్స్‌ వీడియో విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా నాగ చైతన్య తండేల్‌ షూటింగ్‌ లొకేషన్‌ స్టిల్‌ను అభిమానులతో సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. ఈ స్టిల్‌ లో పడవపై నిలబడి తాడు చుడుతున్న నాగ చైతన్య లుక్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories