బిగ్‌ బాస్‌ బ్యూటి పునర్నవి బాయ్‌ ఫ్రెండ్‌ ను చూశారా!

బిగ్‌ బాస్‌ బ్యూటి పునర్నవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలోకి ఉయ్యాలా జంపాలా సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి  మెప్పించింది. ఆ తరువాత  2019లో బిగ్ బాస్ లో పాల్గొని మంచి పాపులారిటీ తెచ్చుకుంది.

 ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ పోస్ట్ చేసింది.. ఆ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గతంలో పునర్నవి రాహుల్ సిప్లిగంజ్ తో రిలేషన్ లో ఉందని వార్తలు వచ్చినా వాటిని ఇద్దరూ కొట్టిపారేశారు.

తాజాగా పునర్నవి తన సోషల్ మీడియాలో ఒక అబ్బాయితో దిగిన ఫోటో పోస్ట్ చేసి విషెష్ చెప్పింది.. ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతుంది.. ఆ ఫోటో కొండల్లో ఎక్కడో దిగినట్లు తెలుస్తుంది. ఫొటోలో వాళ్ళు వెనక్కి తిరిగి కూర్చుడడంతో వారి ముఖాలు కనిపించట్లేదు.. కానీ పునర్నవి వెనక్కి తిరిగి అబ్బాయి మీద చెయ్యి వేసుకొని కనిపిస్తుంది..పునర్నవి ఈ ఫోటో షేర్ చేసి.. నా ఒక్కగానొక్క లవ్ కి హ్యాపీ బర్త్ డే అంటూ పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ ను చూసి అందరు బాయ్ ఫ్రెండ్ అని అందరు అనుకుంటున్నారు.  మరీ ఇందులో నిజమేంటో తెలియాలంటే ఈ భామనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories