ఆ డేట్ ని లాక్ చేసుకున్నారా! రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ VD12 కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో మూవీపై సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి సినీ సర్కిల్స్‌లో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ఈ సినిమాను వేసవి కానుకగా మే 30న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని.. ఈ డేట్‌ని చిత్ర యూనిట్ లాక్ చేసిందనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో నిజంగా ఈ సినిమాను మే 30న విడుదల చేయనున్నారా.. అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్‌గా నటిస్తోంది.