గత అయిదేళ్లలో ఇలాంటివి ఎన్నడైనా చూశామా?

‘‘రాబోయే అయిదేళ్లలో గ్రామాల్లో 17,500 కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లు, పది వేల కిలోమీటర్ల మేర మురుగు కాలువలు నిర్మిస్తాం. ప్రతి ఇంటికీ తాగునీరు అందిస్తాం. చెత్తనుంచి సంపద సృష్టించే కేంద్రాలన్నీ అక్టోబరు 2 నుంచి తిరిగి గ్రామాల్లో ప్రారంభించాలి. పంచాయతీ భవనాల ద్వారా సౌరవిద్యుత్తు ఉత్పత్తి చేయాలి’’ ఇలాంటి మాటలు రాష్ట్ర ప్రభుత్వ అధినేత నుంచి రావడం అనేది గత అయిదేళ్లలో ఎన్నడైనా రాష్ట్ర ప్రజలు చూశారా?  రోడ్ల నిర్మాణం, మురుగు కాల్వల నిర్మాణం వంటి పదాలు గత అయిదేళ్లలో ఎన్నడైనా వినిపించాయా?
జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు తన పాలనకు తేడా ఎలా ఉంటుందో చంద్రబాబునాయుడు చాలా స్పష్టంగా నిరూపిస్తున్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల సమీక్షలో చంద్రబాబునాయుడు పైన చెప్పినట్టుగా అధికారులకు లక్ష్యాలను నిర్దేశించడం రాష్ట్రంలో నిజమైన పురోగతి జరుగుతుందనే అభిప్రాయానికి తావిస్తోంది. వచ్చే జనవరి నుంచి జన్మభూమి పనులు మళ్లీ ప్రారంభిస్తామని అంటూ చంద్రబాబు ఈ లక్ష్యాలను చెప్పడం గమనార్హం.

ఇక్కడ కీలకంగా గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. గ్రామీణ సిమెంటు రోడ్లు, మురుగుకాల్వలు, గ్రామాల్లో సౌర విద్యుత్తు ఉత్పత్తి వంటివేమీ చంద్రబాబు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కాదు. కానీ రాష్ట్ర అభివృద్ధికి, గ్రామాల వికాసానికి ఎంతో ముఖ్యమైన అంశాలుగా ఆయన విశ్వసించే విషయాలు! అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అయిదేళ్లలో  చేయదలచుకుంటున్న పనుల లక్ష్యాలను ఆయన ప్రజల ముందుంచుతున్నారంటే అందుకు చాలా సాహసం ఉండాలి. లక్ష్యాలు పూర్తికాకపోతే ప్రజలు నిలదీస్తారని తెలిసి కూడా చెప్పడం చంద్రబాబులోని చిత్తశుద్ధికి నిదర్శనంగా పలువురు భావిస్తున్నారు.

అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక్క గ్రామీణ రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. తమ పార్టీ నాయకుల ఆస్తులకు, ఫాం హౌస్ లకు దారితీసే రోడ్లను నిర్మించడం తప్ప గోతులు పడ్డ రోడ్లను కూడా ఆ సర్కారు పట్టించుకోలేదు. ప్రజలకు డబ్బు పంచిపెట్టి ఓటు బ్యాంకు తయారుచేసుకోవాలని అనుకున్నారు తప్ప.. అభివృద్ధి అనే మాటను పూర్తిగా విస్మరించారు. చంద్రబాబు తాను హామీలు ఇవ్వకపోయినా.. అటు సంక్షేమ పథకాలను జగన్ కంటె గొప్పగా అమలు చేస్తూ, మరోవైపు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories