నిర్మాతలు తప్పుకున్నారా!

టాలీవుడ్‌లో పెద్ద సినిమాలతో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించాలని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ఎప్పుడు ముందుంటుంది.  అయితే, ఈ బ్యానర్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌ని తెరకెక్కిస్తూ చాలా బిజీగా గడుపుతుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న ఈ నిర్మాణ సంస్థ మరో రెండు కొత్త ప్రాజెక్ట్స్‌ని కూడా తన లైనప్‌ లో ఉంచింది.

అయితే, విశ్వంభర సినిమాని ముందు సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు అనుకున్నారు. కానీ, ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడటంతో నిర్మాతలు పూర్తి నిరాశకు లోనయ్యారనే టాక్ వినపడుతుంది. అంతేగాక, ఈ సినిమా డీల్స్ కూడా ఇంకా క్లోజ్ కాలేదని.. దీంతో నిర్మాతలు మరింత అసంతృప్తిగా ఉన్నారని సినీ సర్కిల్స్‌లో జోరుగా వార్తలు వినపడుతున్నాయి. దీంతో వారు తెరకెక్కించబోయే మరో రెండు ప్రాజెక్ట్స్ నుండి నిర్మాతలు బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మ్యాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి యూవీ క్రియేషన్స్ తప్పుకుందని తెలుస్తుంది. దీంతో పాటు వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబోలో రాబోయే సినిమాను కూడా యూవీ క్రియేషన్స్ వదులుకుందని సినీ సర్కిల్స్‌లో టాక్ వినపడుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే యూవీ క్రియేషన్స్ క్లారిటీ ఇచ్చే వరకు ఆగాల్సిందే మరి.

Related Posts

Comments

spot_img

Recent Stories