థగ్ లైఫ్‌ ఓటీటీ డేట్‌ లాక్ అయ్యిందా!

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ మరియు మణిరత్నం కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉండటం సహజం. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘నాయకుడు’ లాంటి సినిమా తర్వాత మళ్ళీ అదే స్థాయిలో ఏదైనా విజువల్ విందు వస్తుందనే ఆశతో ప్రేక్షకులు ఎదురు చూశారు. కానీ తాజాగా వచ్చిన ‘థగ్ లైఫ్’ ఆ అంచనాలకు పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రేక్షకుల ఊహలకు విరుద్ధంగా ఉండటంతో, మొదటి రోజునుంచే థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయింది.

సినిమా విడుదలైన వెంటనే ఓటిటి రిలీజ్ విషయంపై చర్చలు మొదలయ్యాయి. మొదట ఈ సినిమాని రెండు నెలల తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫాంలో విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం వల్ల ప్లాన్స్ మారినట్లు సమాచారం. తాజా టాక్ ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే ఈ సినిమాని స్ట్రీమింగ్‌కు తీసుకురానుందని ప్రచారం జరుగుతోంది.

ఇక తాజా బజ్ ప్రకారం, ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 27 లేదా జూలై 4న దక్షిణాది భాషలలో ఓటిటిలోకి వచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్ మాత్రం జూలై 31న అందుబాటులోకి రావొచ్చని సమాచారం. అయితే ఈ విషయాలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మొత్తానికి, థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్పందన పొందకపోవడంతో ఓటిటి రిలీజ్ వేగవంతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది.

Related Posts

Comments

spot_img

Recent Stories