తారక్  బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్ పడిందా..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో అడుగుపెట్టిన మొదటి సినిమా “వార్ 2”. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ యాక్షన్ మల్టీస్టారర్ మంచి టాక్ తెచ్చుకుంది. రివ్యూలు మిక్స్ అయినప్పటికీ, వసూళ్ల పరంగా మాత్రం బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల మార్క్ దాటేసింది. ఈ సినిమా ద్వారా తారక్ కి బాలీవుడ్ ఎంట్రీ దక్కడమే కాకుండా యష్ రాజ్ ఫిల్మ్స్ చేస్తున్న స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ లో కూడా ఆయన భాగం అయ్యారు.

ఇక తారక్ ఎంట్రీతోనే బాలీవుడ్ లో మరో సినిమా ఆయన చేతికి వచ్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు “వార్ 2” ఫలితం వెలువడిన తర్వాత ఆ ప్రాజెక్ట్ పై అనుమానాలు మొదలయ్యాయి. తాజా సమాచారం ప్రకారం తారక్ చేయాల్సిన ఆ సోలో సినిమాని మేకర్స్ తాత్కాలికంగా ఆపేశారనే టాక్ వినిపిస్తోంది. “వార్ 2” పూర్తి రన్ ముగిసిన తర్వాతే ఆ ప్రాజెక్ట్ కొనసాగించాలా వద్దా అనేది నిర్ణయిస్తారట.

Related Posts

Comments

spot_img

Recent Stories