ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రెస్టిజీయస్ ప్రాజెక్ట్‌కు సంబంధించి తాజాగా సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది.
ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూజా కార్యక్రమం ఇటీవల ముంబైలా చాలా సింపుల్‌గా జరిగిందని తెలుస్తోంది. ఈ పూజా కార్యక్రమానికి బయట వారిని ఎవరినీ పిలువలేదని సమాచారం. ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేయడంతో ఇక షూటింగ్ కూడా సైలెంట్‌గా జరిపేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ముంబై, ఫారిన్ దేశాల్లో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. ఇక ఈ సినిమాకు పలువురు అంతర్జాతీయ వీఎఫ్ఎక్స్ నిపుణులు పనిచేయనుండగా సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.