పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ఇప్పటికే లాక్ చేశారు.
కానీ, ఈ మూవీ అనుకున్న రిలీజ్ డేట్‌కు విడుదల అవుతుందో లేదో అనే సందేహం సినీ సర్కిల్స్‌లో నెలకొంది. దీంతో ఈ సినిమా రిలీజ్ మరోసారి వాయిదా పడే ఛాన్స్ ఉందనే టాక్ వైరల్ అయ్యింది. అయితే, ఈ చిత్ర రిలీజ్ డేట్‌పై నెలకొన్న సందేహాలకు నిర్మాత ఏఎం.రత్నం చెక్ పెట్టారు. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో అనుకున్న డేట్‌కే రిలీజ్ చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ వర్క్స్ అయిపోయాయని.. బ్యాలెన్స్ వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ చేయడం ఖాయమని ఆయన మరోసారి కన్ఫర్మ్ చేశారు. ఇక ఏఎం.రత్నం లేటెస్ట్ కామెంట్స్‌తో ఈ మూవీపై నెలకొన్న సందేహాలకు పూర్తిగా ఫుల్‌స్టాప్ పడిందని చెప్పాలి. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ సాంగ్‌ను ఫిబ్రవరి 24న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.