హ్యాపీ బర్త్ డే నాన్నా! ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఆయన నటించిన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ ‘పుష్ప 2’ సక్సెస్ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి మార్కులే వచ్చాయి.
ఇక ఈ సినిమా విజయం తర్వాత ఆయన ప్రస్తుతం తన ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలోనే తన తండ్రి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పుట్టినరోజు ని బన్నీ తన కుటుంబ సభ్యులతో కలిపి జరిపారు. తన తండ్రి చేత కేక్ కట్ చేయించాడు బన్నీ.
ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. తమ జీవితాలను అద్భుతంగా మలిచిన తన తండ్రికి ఇలా పుట్టినరోజు వేడుకను జరపడం సంతోషంగా ఉందని బన్నీ చెప్పుకొచ్చాడు. ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటో ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది.