హ్యాపీనెస్ట్ : బాబు సర్కార్ బ్యూటిఫుల్ ప్లాన్!

అమరావతి రాజధానిలో గతంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్మించతలపెట్టిన నివాస గృహాల సముదాయం.. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు మంచి రోజులు రాబోతున్నాయి. చంద్రబాబునాయుడు చేపట్టిన ప్రాజెక్టు గనుక.. జగన్ గద్దె ఎక్కగానే దాన్ని నిర్లక్ష్యం చేశారు. అప్పట్లో బుక్ చేసుకున్న వారు 177మంది తమ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. తీరా ఇప్పుడు చంద్రబాబు మళ్లీ గద్దె ఎక్కాక.. ప్రాజెక్టు మళ్లీ చేద్దామని పూనుకుంటే.. నిర్మాణ వ్యయం దాదాపు 170 కోట్లకు పైగా భారం పెరిగే పరిస్థితి ఏర్పడింది. అయితే.. సీఆర్డీయే మీద భారం పడకుండా.. ఫ్లాట్లు పూర్తిచేసి అప్పగించడానికి చంద్రబాబునాయుడు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఎటూ కొత్తగా టెండర్లు పిలిచారు.. సీఆర్డీయే మీద అదేనపు భారం కూడా లేదు గనుక.. ప్రాజెక్టు పరుగులు పెట్టే అవకాశం ఉంది.

జగన్ నిర్లక్ష్యం కారణంగా హాపీ నెస్ట్ ఆగిపోవడంతో నమ్మకంపోయిన ఇన్వెస్టర్లు తమ అడ్వాన్సులు వెనక్కు తీసుకున్నారు. అలా 177 మంది వెనక్కెళ్లారు. 1200 ఫ్లాట్లలో మరో 13 బుక్ కాలేదు. మొత్తం 190 అలా ఉండిపోయాయి. ఇప్పుడు వీటిని విక్రయించడానికి సీఆర్డీయే పూనుకుంటోంది. అయితే అదనంగా పడగల భారాన్ని కూడా ఈ విక్రయాల ద్వారానే సమకూర్చుకోవడానికి ప్లాన్ చేశారు.

ప్రారంభంలో బుక్ చేసుకున్న అందరూ చ.అడుగు 4049 కే కొన్నారు. అదే ధరకు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాలని చంద్రబాబు స్పష్టంగా ఆదేశించారు. ఇప్పుడు మిగిలిన 190 ఫ్లాట్లకు మాత్రం ధర మారిపోతుంది. పైగా వాటిని ఇప్పుడే విక్రయించకుండా.. కొన్ని నెలలు గడిచిన తర్వాత.. అమరావతి నగర నిర్మాణ పనులు, ఇతర మౌలిక వసతుల పనులు జరుగుతుండగా.. హాపీ నెస్ట్ నివాస సముదాయాలు కూడా దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చిన తర్వాత విక్రయించాలని అనుకుంటున్నారు. అందువల్ల అప్పుడు వాటి ధర బాగా పెరుగుతుంది. పైగా వాటిని ఆన్ లైన్ లో బుక్ చేసుకునే పద్ధతిలో కాకుండా వేలం ద్వారా అమ్మాలని అనుకుంటున్నారు. అలా చేసినట్లయితే.. 190 ఫ్లాట్లకు గాను.. సీఆర్డీయేకు 200 కోట్లకు పైగా వస్తుందనేది అంచనా. అదే జరిగితే.. జగన్ వీటిని స్తంభింపజేయడం వల్ల 200 కోట్ల అదనపు భారం పడినప్పటికీ.. ఒక్కపైసా కూడా నష్టం రాకుండా ఆ నష్టాన్ని పూడ్చుకోవడం అనేది చంద్రబాబు సర్కారు సాధ్యం చేసినట్టు అవుతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories