హమ్మయ్య ఊపిరి పీల్చుకున్న బొత్స !

చంద్రబాబు నాయుడు తాజా నిర్ణయం ఎవరికి ఎలా ధ్వనించిందో తెలియదు గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కు మాత్రం వీనుల విందుగా వినిపించి ఉంటుందనడంలో సందేహం లేదు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎన్నికల్లో తెలుగుదేశం బరిలోకి దిగితే నెగ్గడానికి భారీగా ఖర్చు పెట్టవలసి వస్తుందని తర్జనభర్జనలో పడిన బొత్స సత్యనారాయణ ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. సొంతంగా చాలినంత బలం లేకపోవడం వలన హుందా రాజకీయాలు మాత్రమే చేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించడంతో అధికార ఎన్డీఏ కూటమి పోటీ చేయరాదని అనుకుంది. ఈ తాజా నిర్ణయం తెలుగుదేశంలో పోటీ చేయాలని అనుకున్న కొందరు వ్యక్తులకు ఆశలపై నీళ్లు చిలకరించినప్పటికీ, బొత్స సత్యనారాయణ మాత్రం మాక్సిమం హ్యాపీ ఫీలవుతున్నారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స పేరును ప్రకటించినప్పటికీ.. ఆయనకు ఖర్చు తడిసి మోపెడవుతోంది. తెలుగుదేశం ఖచ్చితంగా బరిలోకి దిగుతుంని నిన్నటిదాకా ఊహాగానాలు సాగడంతో.. తమ పార్టీ వారే అయినా ఓటర్లదరినీ కట్టుగా ఉంచుకోవడానికి, వారిని ప్రసన్నం చేసుకోవడానికి బొత్స సత్యనారాయణ నానా పాట్లు పడుతూ వచ్చారు.

వైసీపీకి చెందిన ఓటర్లను క్యాంపు రాజకీయాలకు తరలించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఓటర్లకు కుటుంబాల సహా బెంగుళూరు, కర్నాటకలోని ఇతర ముఖ్యప్రాంతాల్లో విహార యాత్రలు ఏర్పాటు చేశారు.   టీడీపీ బరిలోకి దిగితే తమ పార్టీ ఓటర్లందరికీ భారీ తాయిలాలు ఇవ్వాలని కూడా సిద్ధం అయ్యారు. కొన్ని కోట్లరూపాయలు వారికి ఇవ్వడానికి బొత్స సిద్ధపడ్డారు. చివరకు ఆయన సేఫ్ జోన్ లో పడ్డారు. తెలుగుదేశం పోటీచేయకపోతుండగా.. బొత్సకు లైన్ క్లియర్ అయింది. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బొత్స ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎమ్మెల్సీ కావడానికి ఎన్ని కోట్ల రూపాయల చేతి చమురు వదులుతుందో అనుకుంటూ ఉండగా.. తాజాగా సేఫ్ గా మండలిలోకి అడుగుపెట్టే అవకాశం రావడంతో ఆయన వర్గం హేపీగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories