ఓటీటీ హక్కులతోటే సగం బడ్జెట్‌ వచ్చేసిందిగా గురూ!

టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కచ్చితంగా ప్రభాసే అని చెబుతారు. డైరెక్టర్ల ఫస్ట్‌ చాయిస్ గా ప్రభాస్‌ మారిపోయాడు. బాహుబలి తరువాత సలార్‌ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్‌ క్షణం తీరిక లేకుండా సినిమాలు చేస్తున్నాడు.

అందులో మోస్ట్‌ అవైయిటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ. ఈ సినిమాని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తుండగా… అశ్వినిదత్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టాడు. ఈ చిత్రాన్ని ఇండస్ట్రీలోనే అత్యధిక బడ్జెట్‌ చిత్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం 600 కోట్లు బడ్జెట్‌ పెడుతున్నారని సమాచారం అయితే ఉంది. ఇందులో సగం ఖర్చుని కేవలం ఓటీటీల ద్వారానే సినిమా నిర్మాతలు రాబట్టేసినట్లుగా టాక్‌.

అటు హిందీతో పాటు సౌత్‌ భాషలు అన్నింటిలో ఈ సినిమాని రికార్డు ధరకి కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. కేవలం అదే 300 కోట్లకు పైగా దాటేశాయి. దీంతో అసలు సినీ ప్రపంచంలో ప్రభాస్‌ కి ఏ రేంజ్‌ మార్కెట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రాన్ని వర్లడ్‌ వైడ్‌ గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్‌ చేస్తుంది.

ఓటీటీలోనే ఇంత బిజినెస్‌ ఉంటే ఇక థియేట్రికల్‌ లెవల్లో బిజినెస్‌ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాకి మంచి టాక్‌ పడితే మాత్రం 1000 కోట్ల గ్రాస్‌ మార్క్‌ ని ఈజీగా చేరుకుంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్‌ ని క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories