స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన తాజా సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా రికార్డులు సృష్టించింది. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఇది ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.
తాజాగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్‌మీట్‌లో హీరో వెంకటేష్ టాలీవుడ్‌లో జరుగుతున్న ఐటీ రైడ్స్, తన రెమ్యునరేషన్ గురించి కామెంట్ చేశారు. టాలీవుడ్‌లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయా.. అంటూ సరదాగా తనకు తెలియనట్లుగా నవ్వుతూ అన్నారు.
అటు తన రెమ్యునరేషన్‌పై కూడా వెంకీ ఇలానే స్పందించారు. తాను అంతా వైట్‌లోనే తీసుకుంటానని.. మిగతా హీరోల గురించి తనకు తెలియదని వెంకీ సెటైరిక్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం వెంకటేష్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.