పోసాని కృష్ణ మురళి ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేశారు. జైలులో ఉండగా.. ఏవైతే బయటకు కనిపించచో.. అలాంటి అనారోగ్యాలు హఠాత్తుగా ఆయనను పలకరిస్తున్నాయి. ఆ బాధలను చెప్పుకుని ఆయన జైలునుంచి బయటకు రావాలని చూస్తున్నారు. కడుపు నొప్పి, గుండెనొప్పి అంటే.. వాటికి తక్షణం ‘కనిపించే’ రుజువులు చూపించాల్సిన అవసరం ఉండదు. రుజువులు కనిపించవు. ఒకవైపు ఆ డ్రామా నడిపిస్తూ పోలీసులను ఇరుకున పెట్టడానికి పోసాని కృష్ణమురళి ప్లాన్ చేస్తే.. ఆయన డ్రామాలను మించిపోతూ.. ఆయనను ఆస్పత్రికి తీసుకువెళ్లడాన్ని కూడా తప్పుపడుతూ.. నిందలు వేస్తూ జగన్ కరపత్రికలు చిల్లర కథనాలు ప్రచారంలో పెట్టడం ఇంకా చోద్యం. తెలుగుదేశం వారిని జగన్ పాలనలో ఎంత నీచంగా వేధించారో మర్చిపోయి.. పోసాని కృష్ణ మురళి మీద ప్రభుత్వం పైశాచికత్వం ప్రదర్శిస్తున్నదంటూ.. మొసలి కన్నీరు కారుస్తున్నారు.
విషయం ఏంటంటే.. పోసాని కృష్ణమురళి ప్రస్తుతం రిమాండులో ఉన్నారు. తనకు విరేచనాలు అయ్యాయని, కడుపునొప్పి, గుండెనొప్పితో బాధపడుతున్నట్టుగా ఆయన కొత్త డ్రామా ప్రారంభించారు. జైలు అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆయనకు ప్రాథమిక వైద్యపరీక్షలు అన్నీ నిర్వహించారు. ఈసీజీ, రక్తపరీక్షలు వంటివన్నీ పూర్తిచేశారు. ఎలాంటి నొప్పికి సంబంధించిన ఆనవాళ్లూ కనిపించలేదు. కానీ పోసాని అదే డ్రామా కంటిన్యూ చేస్తున్నారనే ఉద్దేశంతో కడప రిమ్స్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. పోలీసులు అక్కడకు కూడా తీసుకువెళ్లి అన్ని పరీక్షలు చేయించి.. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదని తేల్చారు కూడా.
కాగా.. రాజంపేట నుంచి రిమ్స్ ఆస్పత్రికి పోసాని కృష్ణ మురళిని పోలీసు వాహనంలో తీసుకువెళ్లిన తీరును జగన్ కరపత్రికలు తప్పుపడుతున్నాయి. నాటకం ఆడుతున్న ఆ వ్యక్తికి అంబులెన్సు ఏర్పాటు చేయలేదట. రిమ్స్ ఆస్పత్రి చేరుకున్న తర్వాత.. పోలీసు వాహనం దిగిన పోసానిని నడిపించి తీసుకువెళ్లారట. వాళ్లు ప్రదర్శిస్తున్న విజువల్స్ చూస్తేనే ఆయన నిక్షేపంగా నడిచి వెళుతున్నది మనకు కనిపిస్తుంది. అలాంటిది.. ఆయనకు వీల్ ఛెయిర్ గానీ, స్ట్రెచర్ గానీ ఏర్పాటు చేయకుండా నడిపించడం అనేది పెద్ద ద్రోహం జరిగినట్టుగా నీలి దళాలు మొసలి కన్నీరు కారుస్తున్నాయి. అంబులెన్సు లేకుండా పోలీసు వాహనంలో తీసుకువెళ్లడమే తప్పు అన్నట్టుగా వైసీపీ మాట్లాడడం చూసి జనం ఛీత్కరించుకుంటున్నారు.
జగన్ పాలన కాలంలో.. అచ్చెన్నాయుడును శ్రీకాకుళంలో అరెస్టు చేసి.. అక్కడినుంచి గుంటూరు దాకా ఆయనను నిరంతరాయంగా వాహనంలో తరలించిన దుర్మార్గమైన తీరు వారు మరచిపోయినట్టున్నారు. ఆపరేషన్ చేయించుకుని, సర్జరీ పుండు పచ్చిగా ఉన్నప్పుడే.. పోలీసు వాహనంలో కూర్చోబెట్టి మరీ అచ్చెన్నాయుడును తరలించిన దుర్మార్గులు.. పూర్తిఆరోగ్యంతో ఉన్నట్టుగా వైద్యపరీక్షల్లోనూ తేలిన వ్యక్తికి అంబులెన్సు ఏర్పాటు చేయలేదంటూ విలపించడం సరికొత్త డ్రామా కాక మరేమిటి? పోసానికి అంబులెన్సు పెడితే.. దాని మీద దాడిచేసి.. కొత్త రాద్ధాంతం చేయడానికి ఏదైనా కుట్ర జరుగుతున్నదేమో అని.. వారి డిమాండ్లు గమనిస్తే అర్థమవుతోంది. పోలీసు వాహనంలో తరలిస్తే.. అలాంటి కుట్రలు సాగవని బాధపడుతున్న్టట్టున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.