దేవర సినిమాలో గుజరాతీ భామ.. అంటే ఈ సినిమాలో!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా..జాన్వీ కపూర్‌ కథానాయికగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. ఫుల్‌ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ గా నటిస్తున్నాడు. ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ ఇప్పటికే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్రం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం సెట్స్‌ నుంచి ఎన్టీఆర్‌ మాస్‌ లుక్‌ లో బీచ్‌ ఒడ్డున నిల్చుని ఉన్న ఓ ఫొటో బయటకు వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషిస్తున్న గుజరాతీ అమ్మాయి… శృతి మరాఠే మొదటి సారి ఈ సినిమా గురించి మాట్లాడింది.

దేవర సినిమాలో నటిస్తున్నట్లు ఆమె స్వయంగా తెలిపింది. దేవరలో నటిస్తున్నట్లు శృతి ఓ ఇంటర్వ్యూ ద్వారా వివరించింది. ” దేవర లో సినిమాలో నేను నటిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది. అది నిజమే నేను ఈ సినిమాలో దేవరకు భార్యగా కనిపించనున్నట్లు తెలిపింది.

ఆ పాత్ర నాకెంతో స్పెషల్‌. దసరా కానుకగా ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్లో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ఎన్టీఆర్‌ అభిమానులు లాగానే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ శృతి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె మాటలను బట్టి దేవర సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అని తెలుస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ కూడా ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలిసింది. బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ తంగం అనే పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్న విషయం చిత్ర బృందం తెలిపిన సంగతి తెలిసిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories