గ్యారంటీ ప్రీక్వెల్‌!

గ్యారంటీ ప్రీక్వెల్‌! టాలీవుడ్ సీనియర్ హీరోస్ లో ఒకరైన నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన తాజా భారీ సినిమా “డాకు మహారాజ్”. ఎన్నో అంచనాలు నడుమ విడుదలకి వచ్చిన ఈ సినిమా ఈ సంక్రాంతి బరిలో అంచనాలు రీచ్ అయ్యే విధంగా సాలిడ్ టాక్ ని సొంతం చేసుకుంది. 

అయితే ఈ సినిమా విషయంలో ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి సినీ వర్గాల్లో బయటకి వచ్చింది. థియేటర్స్ లో ఈ చిత్రానికి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ ని ఉన్నట్టుగా చూపలేదు కానీ లేటెస్ట్ గా దీనిపై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్లు మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

దీంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ సినిమా చేస్తున్నట్టుగా చెప్పేశారు. ఈ సినిమాలో కీలక పాయింట్ పై ఈ ప్రీక్వెల్ ని చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టుగా ఇపుడు తేల్చి చెప్పారు. మరి దీనిపై మరిన్ని డీటెయిల్స్ బయటకి రావాల్సి ఉంది.

Related Posts

Comments

spot_img

Recent Stories