ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉండే ఆస్కార్ అవార్డ్స్ వేడుక ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో ‘అనోరా’ చిత్రం వరల్డ్ వైడ్‌గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఆస్కార్స్ బరిలో అవార్డుల పంట పండించింది.
ఉత్తమ చిత్రం మొదలుకొని 5 వివిధ విభాగాల్లో ‘అనోరా’ చిత్రం అవార్డులను అందుకుంది. దీంతో వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా యూనిట్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు. తాజాగా దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి కూడా ‘అనోరా’ టీమ్‌తో పాటు ఆస్కార్ అవార్డు అందుకున్న విజేతలను అభినందించారు.
అనోరా చిత్రం దర్శకుడు సీన్ బేకర్ ఏకంగా నాలుగు అవార్డులు అందుకుని చరిత్ర సృష్టించారంటూ జక్కన్న కామెంట్ చేశాడు. ఆస్కార్ అవార్డుల బరిలో సత్తా చాటిన అందరికీ ఆయన ఈ సందర్భంగా విషెస్ తెలిపారు.