మరో కొత్త సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌!

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇటీవల మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న భైరవం సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు. వేసవిలో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. మరోవైపు, తేజా సజ్జా హీరోగా నటిస్తున్న మిరాయ్ సినిమాలో మనోజ్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.

ఇలాంటి సమయంలో మంచు మనోజ్ మరో కొత్త ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 90ఎంఎల్ సినిమాకు దర్శకత్వం వహించిన శేఖర్ రెడ్డి కథ చెప్పగా, మనోజ్ ఓకే చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించేందుకు ప్లాన్ జరుగుతోందట. ఓ కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు ముందుకొస్తుందని ఫిల్మ్ నగర్ సమాచారం.

అయితే ఈ వార్తలన్నింటిలో ఎంత వరకు నిజమో తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories