టాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ సర్జా ఇంట పెళ్లి బజాలు మోగాయి. అర్జున్ పెద్ద కుమార్తె ఐశ్వర్య అర్జున్, తమిళ హీరో ఉమాపతి రామయ్య వివాహ బంధం మంగళవారం నాడు ఒక్కటయ్యారు. వీరి వివాహం చెన్నైలోని హనుమాన్ ఆలయంలో జరిగింది. వీరి పెళ్లికి సన్నిహితులు, బంధువులు, సినీ ప్రముఖులు కొందరు హాజరయ్యారు.
సముద్ర ఖని, విశాల్ తండ్రి నిర్మాత జీకే రెడ్డి, కేఎస్ రవికుమార్, నటుడు విజయ్‌కుమార్ తో పాటు మరికొంత మంది తమిళ స్టార్స్ ఈ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ వేడుకల అనంతరం చెన్నైలోని ఓ స్టార్ హోటల్లో ఐశ్వర్య, ఉమాపతి రిసెప్షన్ వేడుకలు జరగనున్నాయి.
ఐశ్వర్య అర్జున్ వెడ్డింగ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.