టైటిల్‌ కుదిరిందా!

టాలీవుడ్‌లో దర్శకుడు నక్కిన త్రినాథరావు డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘మజాకా’ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంది. డీసెంట్ టాక్‌తో ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో దర్శకుడు త్రినాథరావు తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నారు.

అయితే, ఆయన ఇప్పటికే తన నెక్స్ట్ చిత్రానికి సంబంధించిన కథను ఓ మాస్ హీరోకు వివరించినట్లు తెలుస్తోంది. మాస్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు నక్కిన త్రినాథరావు ఓ స్టోరీ లైన్ వినిపించాడని.. దీనికి హీరో కూడా ఓకే చెప్పాడని సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

కాగా, బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలన్నీ పూర్తయ్యాకే ‘మజాకా’ డైరెక్టర్‌తో సినిమా చేసే అవకాశం కనిపిస్తుంది. మరి నిజంగానే వీరి కాంబినేషన్‌లో సినిమా రానుందా.. అనేది వేచి చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories