తెలిసిపోయిందోచ్! నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ హిట్ చిత్రం “డాకు మహారాజ్” లేటెస్ట్ గానే ఓటిటిలో వచ్చి మళ్ళీ మంచి రెస్పాన్స్ ని కొల్లగొడుతుంది. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ చిత్రం “అఖండ 2 తాండవం” చేస్తున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ కంటే మరింత గ్రాండ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తారాగణం పరంగా కూడా చాలా పక్కాగా ప్లాన్ చేస్తున్న బోయపాటి శ్రీను తన వైరం ధనుష్.. అదే ఆది పినిశెట్టిని కూడా కీలక పాత్ర కోసం తీసుకున్నట్టుగా ఆ మధ్య టాక్ వచ్చింది. అయితే ఈ సినిమాలో తాను ఉన్నట్టుగా ఆది లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసాడు.
ఈ చిత్రంలో ఆల్రెడీ తాను ఒక షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసానని నెక్స్ట్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా రివీల్ చేసాడు. సో ఈ యువ నటుడు కూడా ఈ సినిమాలో కనిపించనున్నాడని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు