గోరంట్ల పుణ్యం : డజను మంది పోలీసుల కెరీర్ ఢమాల్!

ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుంది. తాను ఒకప్పటి చట్టసభ ప్రతినిధిని అని విర్రవీగుతూ.. చట్టం ఎదుట ఎవడైనా తలెగరేస్తే.. మెడలువంచి బుద్ధి చెప్పడానికే పోలీసు వ్యవస్థ ఉంటుంది గానీ.. డూడూ బసవన్నలా అతడి వేషాలకు తలఊపడానికి కాదని ప్రభుత్వం నిరూపించింది. ఒకవైపు పోలీసు కస్టడీలో ఉంటూ.. కస్టడీలో ఉన్న గోరంట్ల మాధవ్ కు అప్రకటితంగా దక్కిన రాయల్ ట్రీట్ మెంట్ పై ప్రభుత్వం గుస్సా అయింది. దీని ప్రభావం ఒక డీఎస్పీ సీతారామయ్యను బదిలీచేసి డీజీపీ వద్ద రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నందుకు మరో 11 మంది పోలీసుల మీద సస్పెన్షన్ వేటు వేశారు. అరెస్టులు చేసే సందర్భాల్లో వైసీపీ నాయకులు తలెగరరేస్తూ వ్యవహరిస్తే.. భజనపరులైన కొందరు పోలీసులు భయభక్తులతో వారికి సేవలు అందిస్తూ కూర్చోకుండా ముందుముందు క్రమశిక్షణగా నడుచుకోవాలనే హెచ్చరిక సంకేతాలను ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి.

గోరంట్ల మాధవ్ అరెస్టు, ఆ పిమ్మట కోర్టు ఎదుట హాజరుపరచడం,  అక్కడినుంచి తరలించరే సమయాలలో పోలీసులు వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శల పాలవుతోంది. వైద్య పరీక్షల నిమిత్తం మాధవ్ ను జీజీహెచ్ కు తీసుకువెళ్లినప్పుడు.. ఒక వైసీపీ నాయకుడు తన ఫోను లో ఎవరికో కాల్ చేసి దానిని తీసుకొచ్చి మాధవ్ కు ఇచ్చారు. ఆయన కస్టడీలో ఉంటూ ఫోన్లో మాట్లాడుతున్నా బందోబస్తు సిబ్బంది అభ్యంతర పెట్టలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టడానికి ముసుగు వేసుకోమంటే పోలీసుల మీద ఎగిరెగిరి పడ్డారు. అసలు మీడియా ముందుకు రానేలేదు. అలాగే కోర్టు వద్ద కూడా పోలీసు వాహనం దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు. ఇవన్నీ ఆయనకు బందోబస్తుగా ఉన్న పోలీసుల వైఫల్యంగానే భావించి వారందరి మీద వేటు వేశారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోంచి దిగిపోయారే గానీ.. తాము అధికారంలో ఉన్నప్పుడు, అవినీతి మార్గాల్లో  పెంచిపోషించిన అరాచక శక్తుల ద్వారా.. అన్ని శాఖల్లోనూ లోపాయికారీ సంబంధాలు పుష్కలంగానే కలిగిఉన్నారు. కొన్ని శాఖల్లో గత ప్రభుత్వం హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అనేది ఉన్నతాధికార్లకు ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే జరిగిపోవడం కూడా చోటుచేసుకుంది. అలాగే పోలీసుల్లో కూడా వైసీపీ అనుకూల కోవర్టులు పుష్కలంగా ఉన్నారనే అనుమానాలు పలువురిలో ఉన్నాయి. వైఎస్ భారతిపై అసభ్య పోస్టులు పెట్టిన చేబ్రోలు కిరణ్ అను లరెస్టు చేసి తరలిస్తున్న సంగతిని.. ఆయనకు పోలీసుల్లోనే ఎవరో రహస్యంగా సమాచారం చేరవేశారని అనుమానిస్తున్నారు. అలాగే.. కాకాణి గోవర్దన రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి.. పోలీసులు నెల్లూరులోని ఆయన ఇళ్లకు వెళ్లినా, హైదరాబాదులోని బంధువుల ఇళ్లకు వెళ్లినా.. ముందుగానే ఆయనకు సమాచారం తెలిసిపోతున్నదని, అందుకే ఆయన ప్రతిచోటునుంచి ముందుగానే తప్పించుకుంటూ తిరుగుతున్నారని ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసుల్లో వైసీపీకి దొంగచాటుగా సహకరించే వారికి ఒక హెచ్చరిక పంపేలాగా.. గోరంట్ల మాధవ్ పుణ్యమాని డజను మందిపై ప్రభుత్వం వేటు వేయడం విశేషం. 

Related Posts

Comments

spot_img

Recent Stories