మ్యాచో స్టార్ గోపీచంద్ లాస్ట్ మూవీ ‘విశ్వం’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. ఇక ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకుని గోపీచంద్ తన నెక్స్ట్ ప్రాజెక్టులను అనౌన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు సంకల్ప్ రెడ్డి డైరెక్షన్‌లో ఓ సినిమాను అనౌన్స్ చేశాడు గోపీచంద్.
ఇక ఇప్పుడు మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు ఈ హీరో. కొత్త దర్శకుడు కుమార్ వెల్లంకి డైరెక్షన్‌లో గోపీచంద్ కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చరిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
కాగా ఈ సినిమాకు షామ్‌దత్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.