దాని గురించి అదిరిపోయే అప్డేట్‌ ఇచ్చిన గోపిచంద్‌!

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సన్నీ డియోల్ పోయిన సంవత్సరం “గదర్ 2” బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా తర్వాత తాను మన టాలీవుడ్ మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో ఓ సాలిడ్ ప్రాజెక్ట్ ని చేస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ కాంబో అంటూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుంది.

అయితే ఈ సినిమాపై మేకర్స్ కానీ దర్శకుడు కానీ ఎప్పుటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండగా ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేషన్ పై మరో అప్డేట్ ని డైరెక్టర్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. అయితే ఈసారి ఒక యాక్షన్ అప్డేట్ ని అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పాలి. ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ తో ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ ని తాను డిజైన్ చేస్తున్నట్టుగా మాస్ ఫీస్ట్ లోడింగ్ అంటూ తాజా అప్డేట్ అందించారు.

ఇలా మొత్తంగా అయితే సినిమా ఫుల్ స్వింగ్ లో కంప్లీట్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమా హిందీ, తెలుగు భాషల్లో కూడా విడుదలకు సిద్దంగా ఉంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories